కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ

కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ
  • ఏపీలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ కు అవకాశం కల్పించాలని విన‌తి.
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనంను ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు.